ఎస్ఐ పై వరకట్నం వేధింపుల కేసు నమోదు
సలాం ప్రొద్దుటూరు : పొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ కాలనీ నందు నివాసముండే సిరివెళ్ల ఇషాక్ మరియు సుజాతల కుమార్తె ప్రియాంకను నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గొడిగెనూరు గ్రామానికి చెందిన ఇండ్ల భరత్ కుమార్ తో 2025 ఆగస్టులో వివాహమైనది. ప్రస్తుతం భరత్ కుమార్ నంద్యాల జిల్లా ఫింగర్ ప్రింట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. వివాహం అయినప్పటినుండి తన భార్య ప్రియాంకను మానసికంగా శారీరకంగా హింసించి అదనపు కట్నం కావాలని వేధించాడు. ఇప్పటివరకు తన భార్యను కాపురానికి పిలుచుకుపోలేదని పలుమార్లు పెద్ద మనుషుల...