సలాం ప్రొద్దుటూరు :
పొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ కాలనీ నందు నివాసముండే సిరివెళ్ల ఇషాక్ మరియు సుజాతల కుమార్తె ప్రియాంకను నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గొడిగెనూరు గ్రామానికి చెందిన ఇండ్ల భరత్ కుమార్ తో 2025 ఆగస్టులో వివాహమైనది. ప్రస్తుతం భరత్ కుమార్ నంద్యాల జిల్లా ఫింగర్ ప్రింట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. వివాహం అయినప్పటినుండి తన భార్య ప్రియాంకను మానసికంగా శారీరకంగా హింసించి అదనపు కట్నం కావాలని వేధించాడు. ఇప్పటివరకు తన భార్యను కాపురానికి పిలుచుకుపోలేదని పలుమార్లు పెద్ద మనుషుల ద్వారా పంచాయతీ చేసినా కూడా ఒప్పుకోలేదని బాధితురాలు చెప్పినది. ఈ మేరకు బాధితురాలు ప్రియాంక ఆమె తల్లిదండ్రులు ప్రొద్దుటూరు ఏ ఎస్ పి విభూ కృష్ణ గారిని ఆశ్రయించినారు. బాధితురాలు ప్రియాంక భర్త భరత్ కుమార్ అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమైనది. ఈ ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి.మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టినారు.