SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 2:11 pm Posted by : SALAM PRODDATUR

అయోధ్య పాపాల భైరవులను హిందువులే శిక్షించాలి 

 

–కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటాన్ మహమ్మద్ అలీ ఖాన్

సలాం ప్రొద్దుటూరు (కడప):

 

దొంగ జపం చేస్తూ దొంగ భక్తీ నటిస్తూ అయోధ్యలోని రామ మందిరంలో విచ్చలవిడిగా జరుగుతున్న వేలకోట్ల రూపాయల దోపిడీ సూత్రధారులైన పాపాల భైరవులు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీలను హిందువులు స్వయంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. కడపలోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రాముడి దేవాలయ నిర్మాణం మొదలుకొని అక్కడి పరిపాలన సభ్యుల నియామకం, పరిపాలన, ఆలయ హుండీ ఆదాయం, లెక్కింపు, నిర్వహణ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుమారు 5,000 కోట్ల రూపాయల దోపిడీకి పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందువుల సంరక్షకులుగా, హిందూ మత ప్రతినిధులుగా భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మత విద్వేష భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు బాబ్రీ మసీదును విధ్వంసం చేసి అక్కడ రామాలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు ప్రకటించుకున్నారన్నారు. రాముని పేరిట చేస్తున్న రాజకీయం పూర్తిగా కుండబద్దలు కొట్టినట్లు ఇటీవల జరిగిన దోపిడీ వ్యవహారం ద్వారా బహిర్గత మైందన్నారు. ఈ విధంగా అనాదిగా హిందూ మతాన్ని, హిందువులను ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్ పూర్తిగా మోసం చేస్తున్నారన్నారు. ఆలయ సంపద ను దోపిడీ చేయడంలో వారందరూ సూత్రధారులేనని ధ్వజమెత్తారు. భారతదేశాన్ని పరిపాలించిన బాబర్, హుమయున్, ఔరంగాజేబు, గజిని కూడా కొల్లగొట్టని విధంగా దేవుడి సొమ్మును దోపిడీ చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ దేనన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గా ప్రసారం చేస్తూ ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో దేవుడు సొమ్ము దోపిడీలో కీలక పాత్ర పోషించినట్లు అక్కడి ప్రజలు స్వయంగా ఆరోపిస్తున్నారు అన్నారు. హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలను చూపిస్తూ, ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొడుతూ మతోన్మాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ మత విద్వేషానికి కాలం చెల్లిందన్నారు. ఈ దోపిడీతో మత విద్వేష రాజకీయాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి బండారం పూర్తిగా బహిర్గత మైందన్నారు. దొంగ జపం చేస్తూ, దొంగ భక్తీ నటిస్తూ హిందువులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల ఓట్లు తీసుకోవడంతో పాటుగా వారు రాముడి పేరిట సమర్పించిన కానుకలు, నగదును కూడా దోపిడీ చేయడం సిగ్గుచేటన్నారు. ఔరంగజేబు, బాబర్, హ్యూమన్ ను విలన్ గా చూపిస్తున్న ఈ దొంగ పాలకుల అసలు రూపం హిందువులు తెలుసుకొని ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.

అనదిగా హిందువులను దోచుకుంటున్న ఈ ఘరానా దొంగల గుట్టు ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింద న్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం వెలగబెడుతున్న ఈ దొంగ ప్రభుత్వాలు, వారి సారథులు కేవలం రాముడి సంపద దోపిడీపై సిట్ ను ఏర్పాటు చేసి, సామాన్య ఉద్యోగులను మాత్రమే దోపిడికి బాధ్యులు చేయడం దారుణ మన్నారు. ఈ దోపిడీ, కుంభకోణంలో అసలు సూత్రధారులు వెల్లడి కావాల్సి ఉందని తెలిపారు. అన్నీ తానై నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ విష్ణు మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ మాత్రమేనన్నారు. ముందు వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారం దొంగల చేతుల్లో ఉంది కాబట్టి, శిక్ష నుంచి వారు తప్పించుకోకుండా హిందువులే స్వయంగా మహాపరాధం చేసిన ఈ దొంగ పాలకులకు కఠినంగా శిక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మయానా రహమతుల్లా ఖాన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.