SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 5:46 pm Posted by : SALAM PRODDATUR

విధులకు సక్రమంగా హాజరుకాని బి ఎల్ ఓ పై చర్యలు తీసుకోవాలి

సలాం ప్రొద్దుటూరు :

 

ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలోని DCSR కాలనీ ఉర్దూ ప్రాథమిక పాఠశాల బూత్ నెంబర్ 240 బి ఎల్ ఓ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ వెంకట రమణారెడ్డి, గారు 15వ తేదీ నుంచి నేటికీ 12 రోజులకు గాను నాలుగు ఐదు రోజులు మాత్రమే విధులకు హాజరైనారు . ఇంతవరకు ఇంకా కొంతమందికి ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వలేదు, ఈయన ఇద్దరు వ్యక్తుల దగ్గర ఎన్యుమరేషన్ ఫార్మ్స్ పెట్టి , వాళ్ల దగ్గర తీసుకోమంటున్నారు, ఇలా చేయడం ఎంత మటుకు సమంజసం. ప్రతిరోజు విధులకు బిఎల్ఓ లు, తప్పనిసరిగా హాజరై ప్రజలకు ఓటర్ జాబితా వారి యొక్క సందేహాలు నివృత్తి చేస్తున్నారు. కానీ ఈయన రూటే సపరేటు. విధులకు ఇలాగనే హాజరైతే, ఈయనపై తగు చర్యలు తీసుకొని ఇంకొకరికి బాధ్యతలు ఇవ్వవలసినదిగా, ప్రొద్దుటూరు తహసిల్దార్ గారికి, ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది. వెంటనే తహసిల్దార్ గారు , బిఎల్ఓ గారికి పిలిపించి విధులకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని తాసిల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎంపీజే పట్టణ అధ్యక్షులు హుస్సేన్ భాష, కార్యదర్శి రఫీ ,సభ్యులు ముక్తార్, విశ్రాంత ఉపాధ్యాయులు గౌస్ లాజం గారు తదితరులు హాజరైనారు.