మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఘనంగా జయంతి
సలాం ప్రొద్దుటూరు: మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు భారత రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన ప్రధాన మంత్రుల్లో ఒకరని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆదివారం ప్రొద్దుటూరులోని ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ, పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడిగా, దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిగా దేశానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి...