భూమి కోసం భవిష్యత్ కోసం – పర్యావరణానికి ఒక మాగ్నా కార్టా అవసరం
–భూమిపుత్ర శ్రీహరి మూర్తి రచయిత,పర్యావరణవేత్త –మాగ్నా కార్టా ఆవిర్భావం - అధికారానికి హద్దులు గీసిన చరిత్ర సలాం ప్రొద్దుటూరు: చరిత్రలో కొన్ని రోజులు కాలగమనంలో కలిసిపోతాయి. మరికొన్ని రోజులు కాలాన్నే కొత్త దిశగా మలుస్తాయి. 1215 జూన్ 15 అలాంటి రోజు. రన్నీమీడ్ మైదానంలో రాజు జాన్ ముద్రించిన ఒక పత్రం ఆ క్షణంలో ఒక రాజకీయ ఒప్పందంగా రూపుదిద్దుకున్నప్పటికీ, కాలక్రమంలో అది ప్రపంచ రాజకీయ చరిత్రను ప్రభావితం చేసిన మహత్తర మైలురాయిగా ఎదిగింది. రాజాధికారానికి హద్దులు, చట్టానికి గౌరవం, వ్యక్తిగత...