*ట్రాఫిక్ పోలీస్ నెల్లూరు సిటీ*
సలాం ప్రొద్దుటూరు (నెల్లూరు సిటీ):
రొట్టెలు పండగ-2026 బందోబస్త్ లో భాగంగా జిల్లా ఎస్పీ Dr. ఆజిత వేజెండ్ల ఆదేశాలు మేరకు, టౌన్ ASP దీక్ష సూచనలతో నెల్లూరు సిటీ ట్రాఫిక్ డివిజన్ వారు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రెగ్యులేషన్స్, కట్ ఆఫ్ పాయింట్స్ మరియు పార్కింగ్ పాయింట్స్ వివరాలు :
నెల్లూరు బారాషాహీద్ దర్గా వద్ద 26.06.2026 నుండి 30.06.2026 వరకు రొట్టెల పండుగ నిర్వహణ సందర్భంగా ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టారు.
25.06.2026 నుండి భక్తులు/సందర్శకుల వాహనాల రాకపోకలకు ప్రత్యేక పార్కింగ్ విధానం అమలు.
పార్కింగ్ వివరాలు
చెన్నై, గూడూరు వైపు నుండి వచ్చే వాహనాలు
•అయ్యప్పగుడి → మినీ బైపాస్ → D-Mart పక్కన సైన్స్ పార్క్
•అయ్యప్పగుడి సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో నిలపాలి.
*విజయవాడ, కావలి, కడప, ఆత్మకూరు, బుచ్చి వైపు నుండి వచ్చే వాహనాలు*
•NH-16 మీదుగా SVGS కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో నిలపాలి.
*జొన్నవాడ మార్గం నుండి వచ్చే వాహనాలు*
•DSN మినీ ఫంక్షన్ హాల్ ముందు/వెనుక ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో నిలపాలి.
*రాపూరు, పొదలకూరు వైపు నుండి వచ్చే వాహనాలు*
•ప్రసార భారతి (All India Radio Station) వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో నిలపాలి.
•వాహనదారులు తిరుగు ప్రయాణం కూడా సూచించిన మార్గాల ద్వారానే వెళ్లాలి.
*భక్తుల సౌకర్యాలు*
•అన్ని పార్కింగ్ ప్రాంతాల్లో:
•బయో టాయిలెట్స్
•టెంట్ల ఏర్పాటు
•తాగునీటి సదుపాయాలు ఏర్పాటు.
*ముఖ్య గమనికలు*
👉•బట్వాడిపాలెం సెంటర్, DSR జంక్షన్, పెట్రోల్ బంక్ జంక్షన్, పొదలకూరు రోడ్ జంక్షన్ వద్ద నుండి దర్గా వైపు అనుమతి లేని వాహనాలకు ప్రవేశం లేదు.
👉రొట్టెల పండుగ సందర్భంగా దర్గా పరిసర ప్రాంతాలలో ఇసుక ట్రాక్టర్లు, ట్రిప్పర్లు,
లారీలు మరియు భారీ వాహనాలకు అనుమతి లేదు.
👉భక్తులు, సందర్శకులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి.