SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 12:13 am Posted by : SALAM PRODDATUR

బేపారి ఆరిఫ్ ఆధ్వర్యంలో ‘ సర్ ‘ హెల్ప్ డెస్క్..

సలాం ప్రొద్దుటూరు:

బి ఎం ఎం ఫంక్షన్ హాల్ అధినేత బేపారి ఆరిఫ్ ప్రజా సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. తండ్రి అడుగుజాడ లు ప్రతినిత్యం అనుసరిస్తూ తండ్రి తగ్గ తనయుడు అని యుక్త వయసులోనే అందరి మన్నలను పొందుతున్నారు. ‘సర్ ‘ అంటే సింహభాగం  ప్రజలకు తెలియదు. ఎలా నింపాలి? ఎలా రాయాలి? ఫామ్ నింపేటప్పుడు   పొరపాట్లు జరుగుతే ఎలా అనే సందేహాలు తో పాటు కొద్ది పాటి భయం కూడా ప్రజలలో లేకపోలేదు. దీంతో బేపారి ఆరిఫ్ సుఅలోచనతో ప్రజల కోసం  “సర్” హెల్ప్ డెస్క్ ను స్థానిక జామియా మసీదు లో కొంతమంది చదువుకున్నవారు తోడు  తీసుకొని   ఈనెల 14 వ తేదీన మొదలుపెట్టారు. జోకేపాలెం, హైదర్ ఖాన్ వీధి, రాజాజీ రోడ్, బాలోబిగారి వీధి, ఆదర్శ నగర, బంగారు మార్కెట్,పెన్నా నగర్ చెందిన ప్రజలు వచ్చి ఈ హెల్ప్ డెస్క్ వద్ద బారులు తీరుతున్నారు. ఓపిక  తో వచ్చిన ప్రజల ను పలకరిస్తూ వారి లో సర్ కు సంబంధించి ఉన్న ఆందోళన దూరం చేసి ఫామ్ లు నింపి ప్రజా సేవ చేస్తు అందరి అదర అభీమానాలను పొందుతున్నారు.