SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 12:05 pm Posted by : SALAM PRODDATUR

ఘనంగా ” షా హుస్సేన్ వలి” స్వామి బర్సీ

 

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రతి సంవత్సరం మొహరం మాసం 8వ రోజున ( ఆట్ ఖన్) నిర్వహించే శ్రీశ్రీశ్రీ హజరత్ షా హుస్సేన్ వలి స్వామి వారి బర్సీ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక బంగారు బజార్ లోని షాహుసైన్ వలి స్వామివారి దర్గా నందు ఉదయం నమాజ్ అనంతరం ఖురాన్ పఠనం చేశారు . అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో బర్సి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.భక్తులు స్వామివారికి ఘనమైన పూల దుప్పటి , గంధం సమర్పించి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫాతేహా అనంతరం దువా చేసారు.ఈ కార్యక్రమం ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & ప్రొద్దుటూరు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ అధ్యక్షులు డా. వి.ఎస్. ముక్తియార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం ఉపఅధ్యక్షులు బొల్లారం భాషా , కమిటీ కార్యదర్శి ఖురేషి ఇలియాస్ , అంజుమన్ సభ్యులు కె. ఖలీల్ భాషా , ఇతర అంజుమన్ సభ్యులు హాజరయ్యారు. వేలాది మంది భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడగా, సమాజ శాంతి, సౌభ్రాతృత్వం మరియు ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.