కడప బిడ్డ “శ్రీచరణికి” నంబర్ వన్ ర్యాంకింగ్
సలాం ప్రొద్దుటూరు: కడప జిల్లా ముద్దుబిడ్డ శ్రీచరణి క్రికెట్ లో దూసుకెళ్తోంది. క్రికెట్ లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే తన బౌలింగ్ లో అద్భుతాలు సృష్టిస్తోంది. ఐసీసీ టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.భారత యువ స్పిన్నర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గతేడాది టీమిండియా తరపున అరంగేట్రం చేసిన వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన శ్రీచరణి... ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20...