ఈడిగపల్లి గ్రామంలో ఘనంగా మొహరం
సలాం ప్రొద్దుటూరు: ప్రతి ఏటా మొహర్రం వేడుకలను ముస్లిం లు నిర్వహించడం అనేది సర్వసాధారణమే. కానీ ఆ గ్రామంలో మాత్రం హిందువులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఎంతో భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలను నిర్వహించడం విశేషం. అసలు ఆ గ్రామం ఎక్కడ ఉందో చూద్దాం పదండి... కడప జిల్లా వీరబల్లి మండలం ఈడిగపల్లి గ్రామంలో 300 కుటుంబాలకు పైగా హిందువులు నివసిస్తున్నారు. ఈ గ్రామంలో పూర్వీకుల కాలం నుంచి ప్రతి ఏటా జరిగే మొహరం వేడుకలను ఇక్కడ హిందువులే నిర్వహించడం ఆనవాయితీగా...