SIR ఫారం నింపే విధానంపై అవగాహన సదస్సు నిర్వహించిన ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఓటర్లకు SIR (Special Intensive Revision) ఫారాలను సరైన విధంగా ఎలా నింపాలో వివరంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, SIR ఫారం నింపే ప్రక్రియను దశలవారీగా వివరించి, ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సూచించారు. ప్రస్తుతం ఓటరు ధృవీకరణ ప్రక్రియపై చాలా మంది భయాందోళనలకు గురవుతున్నప్పటికీ, ఎలాంటి భయం లేదా గందరగోళానికి అవసరం లేదన్నారు. ముందుగా...