NEET పరీక్షలో నకిలీ అభ్యర్థులు.. ఏడుగురు అరెస్ట్ బీహార్‌లో NEET పరీక్షలో మరోసారి అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అసలు విద్యార్థులకు బదులుగా పరీక్ష రాసిన ఏడుగురు నకిలీ అభ్యర్థులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బయోమెట్రిక్ సంస్థ సిబ్బందితో కుమ్మక్కై, సాల్వర్ గ్యాంగ్‌కు చెందిన ఈ అభ్యర్థులు ఒక్కొక్కరి నుంచి రూ.30 నుంచి రూ.40 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులతో పాటు, మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 24 మందిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా NEET పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో సాల్వర్ గ్యాంగ్‌పై పలు కేసులు నమోదయ్యాయి.