6 నెలలు ఉచితంగా ఆధార్ ఈమెయిల్ అప్‌డేట్

సలాం ప్రొద్దుటూరు: 6 నెలలు ఉచితంగా ఆధార్ ఈమెయిల్ అప్‌డేట్ ఆధార్ ఈమెయిల్‌ను 6 నెలలపాటు ఆధార్ మొబైల్ Appలో ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చని UIDAI తెలిపింది. ప్రస్తుతం యాప్‌లో దీని కోసం వినియోగదారులు రూ.75 చెల్లిస్తున్నారు. అయితే వచ్చే నెల 1 నుంచి DEC 31 వరకు ఈ ఛార్జీ వసూలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇది యాప్ ద్వారా అప్‌డేట్‌ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఆధార్‌తో Mail లింకై ఉంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పొందవచ్చని చెప్పింది.