Date of Publish : 23 June 2026, 2:24 amPosted by : SALAM PRODDATUR
📍చిత్తూరు కలెక్టర్ సంతకం మళ్లీ ఫోర్జరీ.! చిత్తూరు జిల్లాలో మరోసారి కలెక్టర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. కలెక్టరేట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ నిరంజన్ కుమార్ కలెక్టర్, NTR వైద్య సేవా ట్రస్టు సమన్వయాధికారి సంతకాలను ఫోర్జరీ చేసి రూ.6.99 లక్షలు డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన సమన్వయాధికారి సుదర్శన్ పరిశీలించగా విషయం బయటపడింది. కలెక్టర్ ఆదేశాలతో చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.