యోగాంధ్ర రాష్ట్ర స్థాయి విజేతలకు అభినందించిన అనంతపురం కలెక్టర్ ఆనంద్

  సలాం ప్రొద్దుటూరు (అనంతపురం): 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో అనంతపురం జిల్లా క్రీడాకారులు విశిష్ట ప్రతిభ కనబరిచారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన యోగాంధ్ర విజేతలు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ గారిని కలువగా.. యోగాంధ్ర విజేతలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈనెల 15, 16, 17 తేదీలలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో ప్రథమ స్థానాలు సాధించిన వారిని రాష్ట్ర...