SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 2:42 pm Posted by : SALAM PRODDATUR

పల్స్ పోలియో విజయవంతం చేయాలి

సలాం ప్రొద్దుటూరు: 

స్థానిక ఐ యం ఏ హాల్ నందు పల్స్ పోలియో బూత్ వాక్సినేటర్స్ శిక్షణ కార్యక్రమం లో ఈ నెల 28 వ తేది జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో చేయవలసిన విధుల గురించి ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా గీత వివరించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో  వ్యాధి నుండి చిన్నారులను రక్షించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి తల్లిదండ్రులు తమ 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో అనేది పిల్లల్లో శాశ్వత వైకల్యానికి దారితీసే ప్రమాదకరమైన వైరల్ వ్యాధి అని అన్నారు. ఈ వ్యాధిని పూర్తిగా నివారించడానికి పోలియో చుక్కలు అత్యంత ప్రభావవంతమైన రక్షణను అందిస్తాయి. పిల్లలకు ఇప్పటికే సాధారణ టీకాలు వేసినా, పల్స్ పోలియో కార్యక్రమంలో ఇచ్చే అదనపు పోలియో చుక్కలను కూడా తప్పనిసరిగా వేయించాలనీ అన్నారు.పట్టణంలో 102 పోలియో బూత్ ల ఏర్పాటు చేశామని కావున పోలియో బూత్‌ల వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని, బూత్‌కు రాలేని పిల్లలకు మరుసటి రోజు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని “ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు – పోలియో రహిత భారతదేశం మన లక్ష్యం”అని అందరూ సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో వైద్యాధికారి డా నజీర్ బాష , డా సుప్రియ, డిప్యూటి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, హెచ్ ఇ ఓ సుబ్బరాయుడు, సి ఓ లు సుబ్బారెడ్డి, శ్రీదేవి, నాగజ్యోతి, హెల్త్ అసిస్టెంట్స్ జయపాల్, క్రిష్టఫర్, వెంకటసుబ్బయ్య,ఏ యన్ యం,అంగన్వాడీ మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. .