పచ్చదనం నుంచి నాగరికత వరకు — వర్షారణ్యాల ఆవిర్భావ గాథ

  –భూమిపుత్ర శ్రీహరి మూర్తి ,రచయిత, పర్యావరణవేత్త –నేడు ప్రపంచ వర్షారణ్య దినోత్సవం సలాం ప్రొద్దుటూరు: భూమి మీద పచ్చదనం వికసించిన ప్రతి చోట జీవం తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. వర్షం, వెలుతురు, నేల, గాలి పరస్పరం కలిసినప్పుడు ప్రకృతి ఒక అనంత జీవగీతాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ గీతంలో చెట్లు ఆకాశంతో సంభాషిస్తాయి. జలధారలు నేలతో స్నేహం చేస్తాయి. పక్షులు ఋతువుల సందేశాలను మోసుకెళ్తాయి. వేలాది జీవరాశులు సహజీవన సౌందర్యాన్ని ప్రతిఫలిస్తాయి. ఈ విశాల ప్రకృతి వైభవానికి అత్యంత సుసంపన్న రూపంగా వర్షారణ్యాలు...