జీవవైవిధ్య భవిష్యత్తుకు భరోసా బయోస్ఫియర్ రిజర్వులు
–భూమిపుత్ర శ్రీహరి మూర్తి,రచయిత,పర్యావరణవేత్త సలాం ప్రొద్దుటూరు : భూమి చరిత్ర ఒక మహత్తర జీవగాథ. అగ్నిగోళంగా ప్రారంభమైన ఈ గ్రహం, కోట్ల సంవత్సరాల పరిణామ ప్రయాణంలో అనేక రూపాలను సంతరించుకుంటూ జీవానికి నిలయంగా వికసించింది. వర్షపు చినుకుల నుంచి విశాల మహాసముద్రాల వరకు, సూక్ష్మజీవుల నుంచి మహావృక్షాల వరకు, పక్షుల రెక్కల చప్పుడు నుంచి నదుల గలగల ప్రవాహాల వరకు విస్తరించిన జీవరాశుల సమ్మేళనమే భూమి సౌందర్యం. ఈ అపార జీవసంపదే ప్రకృతి వ్యవస్థలకు శక్తిని, స్థిరత్వాన్ని, పునరుత్పత్తి సామర్థ్యాన్ని అందించింది. భూమి...