చురుగ్గా కదులుతున్న నైరుతి
_నేడు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం_ _వచ్చే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు_ _వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం_ సలాం ప్రొద్దుటూరు ( హైదరాబాద్): రాష్ట్రం లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది._ _ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 15రోజులుగా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో భదాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ వరకు విస్తరించి ఆగిపోయిన రుతుపవనాల్లో కదలిక వచ్చినట్టు పేర్కొన్నది. సోమవారం నిజామాబాద్ వరకు విస్తరించగా, మంగళవారం రాష్ట్రమంతటా విస్తరిస్తాయని తెలిపింది....