SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 12:54 am Posted by : SALAM PRODDATUR

కారు ఢీకొని వ్యక్తి మృతి

సలాం ప్రొద్దుటూరు (దువ్వూరు):

దువ్వూరు మండలం కడప కర్నూల్ జాతీయ రహదారిపై పెద్ద జొన్నవరం మెట్ట వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథల మేరకు

మండలంలోని పెద్ద జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన రేఖలకుంట పెద్ద సుబ్బరాయుడు.. 50 సంవత్సరాలు అను అతను కూలి పనికి వెళ్లి, ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా కర్నూల్ నుండి కడపకు వెళ్తున్న టాటా నెక్సన్ కారు ఢీకొనడంతో పెద్ద సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య జయ లక్ష్మమ్మ ఉంది.కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదంలో మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి  పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి  కు తీసుకువెళ్తున్నారని ధనుంజయుడు తెలిపారు.