వృక్ష కడప జిల్లాగా ప్రకటించాలి

  –కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి వినతి. సలాం ప్రొద్దుటూరు  (కడప): కడప జిల్లాను “వృక్ష కడప జిల్లా”గా ప్రకటించి పచ్చదనంతో నింపేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంస్కృతి సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను కోరారు. సోమవారం కలెక్టర్‌ను కలిసి జిల్లాలో విస్తృత స్థాయిలో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై ఆయన చర్చించారు.ఈ సందర్భంగా ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట పెద్ద ఎత్తున...