సలాం ప్రొద్దుటూరు:
జూలై 1న గంగమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట కు మంత్రి ఆనం రామానారాయణారెడ్డి ను సోమవారం ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి కలిసి ఆహ్వానించారు.ప్రొద్దుటూరు పట్టణం గంగమ్మ దేవాలయం వీధి (పప్పుల బజార్) లోని గంగమ్మ దేవాలయ పునః ప్రారంభం కార్యక్రమంలో భాగంగా 01-07-2026 విగ్రహ ప్రతిష్ట మహా కుంభభిషేకములు చేయుటకు కర్ణాటక శృంగేరి శ్రీశారదా పీఠం పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీ విధుశేఖర స్వామి విచ్చేయుచున్నారని,విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణారెడ్డి ను కలసి ఆలయ నిర్వాహకులు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి ,AR ట్రావెల్స్ అధినేత ఆసం సురేష్ కుమార్ రెడ్డి కోరారు.