సలాం ప్రొద్దుటూరు:
ఈ ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు 3 నెలలు గా జీతాలు అందకపోవడంతో మంగళవారం చేపడుతున్న నిరసన కు మద్దతును ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రకటించారు. పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి మంగళవారం ఉదయం 8 గంటల నిరసన కార్యక్రమానికి చేరుకుంటానని తెలిపారు.పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెల PF,ESI పోగా 13,960 రూపాయలు జీతం ఇవ్వాల్సి ఉండగా కాంట్రాక్టర్ కేవలం 11,900 మాత్రమే ఇస్తున్నారని వివరించారు.పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల 13,960 రూపాయలు జీతం ఇచ్చే వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందనీ పేర్కొన్నారు.