పక్కా నిఘా తో జూద స్థావరాన్ని బట్టబయలు–ఏఎస్పీ
సలాం ప్రొద్దుటూరు: ఏఎస్పీ విభూకృష్ణ గురువారం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు. పక్కా నిఘా ఉంచి ఈ జూద స్థావరాన్ని బట్టబయలు చేశామని ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన ముగ్గురు నిందితులు ప్రొద్దుటూరు కు చెందిన కరుమూరు మహేష్, చాపాడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన గోధన నాగయ్య, ప్రొద్దుటూరు మండలం చెందిన దొరసానిపల్లి గ్రామానికి చెందిన రబ్బా బ్రహ్మయ్య సామాన్యులు కారని, వారిపై గతంలోనే వివిధ పోలీస్ స్టేషన్లలో 40కి పైగా నేరపూరిత...