SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 12:13 pm Posted by : SALAM PRODDATUR

పక్కా నిఘా తో జూద స్థావరాన్ని బట్టబయలు–ఏఎస్పీ

సలాం ప్రొద్దుటూరు:

ఏఎస్పీ విభూకృష్ణ గురువారం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు.

పక్కా నిఘా ఉంచి ఈ జూద స్థావరాన్ని బట్టబయలు చేశామని ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన ముగ్గురు నిందితులు ప్రొద్దుటూరు కు చెందిన కరుమూరు మహేష్, చాపాడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన గోధన నాగయ్య, ప్రొద్దుటూరు మండలం చెందిన దొరసానిపల్లి గ్రామానికి చెందిన రబ్బా బ్రహ్మయ్య సామాన్యులు కారని, వారిపై గతంలోనే వివిధ పోలీస్ స్టేషన్లలో 40కి పైగా నేరపూరిత కేసులు నమోదై ఉన్నాయని స్పష్టం చేశారు. పోలీసుల దాడి సమయంలో మరో ముగ్గురు నిందితులు ఇర్ఫాన్, నరసింహ, కానాల వంశీ అక్కడి నుంచి చాకచక్యంగా పరారయ్యారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అక్రమ జూదాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఎంతటి వారైనా సరే జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. ఇలాంటి చట్టవ్యతిరేక పనుల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు గ్యాంబ్లింగ్‌కు దూరంగా ఉండాలని, ఎవరికైనా తమ ప్రాంతాల్లో జూదం, ఇతర అక్రమ వ్యాపారాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ కొండారెడ్డి, ఎస్సైలు మధుసూదనరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.