SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 1:28 am Posted by : SALAM PRODDATUR

అగస్త్యేశ్వర ఆలయంలో నాల్గవ రోజు గవ్యాంతర పూజలు

సలాం ప్రొద్దుటూరు :

ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానము   అగస్త్యేశ్వర ఆలయంలో 15 న సోమవారం ప్రారంభం అయిన పాంచాహ్నిక దీక్షతో శ్రీ శైవాగమ శాస్త్ర ప్రకారంగా శ్రీ రాజ రాజేశ్వరీ సమేత అగస్త్యేశ్వర స్వామి  మరియు శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా శ్రీ అభయ వరద శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల మహా కుంభాభిషేకము 32 మంది పండితులచే కడప జిల్లాలోనే అత్యంత అద్భుతంగా ప్రారంభమైంది .కార్యక్రమములలో భాగంగా నాల్గవ రోజు ఉదయం గవ్యాంతర పూజలు,శిఖర స్థాపన, పంచవింశతి కలశ స్నపనలు, సుబ్రహ్మణ్య మూల మంత్ర జప తర్పణ హవనములు,రుద్ర హవనం,నీరాజనం ప్రసాద వితరణ సాయంత్రం యాగశాలార్చనలు,మూల మంత్ర జప తర్పణ హవనములు,రుద్ర, మూల మంత్ర హోమములు, సుదర్శన హవనం,నీరాజనం,వేద స్వస్తి, ప్రసాద వితరణ వంటి కార్యక్రమములు అత్యద్భుతముగా బ్రహ్మాండముగా జరిగినాయి పై కార్యక్రమములు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. రమణ గారు ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి గారు పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో జరిగినాయి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.