SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 8:12 am Posted by : SALAM PRODDATUR

శివాలయం సర్కిల్ వద్ద ఎం ఎల్ ఎ బహిరంగ సభ

సలాం ప్రొద్దుటూరు:

మంగళవారం స్థానిక శివాలయం సర్కిల్ వద్ద కూటమి పాలన రెండేళ్లు సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి మారుపేరుగా కూటమి ప్రభుత్వం పనితీరు ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని వివరించారు. ఇది కూటమి ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ప్రజలకు సంక్షేమం చేసే పార్టీ టిడిపి అని కొనియాడారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు నిత్యం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వారిని అన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.