విజయవంతంగా.. విజయోత్సవ ర్యాలీ..

సలాం ప్రొద్దుటూరు : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొద్దుటూరులో మంగళవారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ గాంధీ రోడ్డు, విజయకుమార్ సర్కిల్, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సర్కిల్ వరకు కొనసాగింది. కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో పట్టణ టిడిపి అధ్యక్షులు చల్లా రాజగోపాల్ యాదవ్ మాట్లాడుతూ...