SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 8:43 am Posted by : SALAM PRODDATUR

మైనార్టీల సంక్షేమం – టీడీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..

సలాం ప్రొద్దుటూరు:

మైనార్టీల సంక్షేమం – టీడీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత ద్వారా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు సంకల్పం అని శాసనమండలి మాజీ అధ్యక్షులు షరీఫ్   పేర్కొన్నారు. మంగళవారం కూటమి పాలన విజయోత్సవ సభకు హాజరై ఆయన మాట్లాడారు.మైనార్టీ విద్యార్థుల కోసం విద్యా సహాయం, పోటీ పరీక్షల కోచింగ్, ఉపాధి అవకాశాల పెంపు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి ఎస్ ముక్తియార్ , ,రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్ , కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.యస్ జబివుల్లా, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ మౌలానా ముస్తాక్ అహ్మద్  మైనార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.