SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 7:28 am Posted by : SALAM PRODDATUR

మహిళ మంత్రి పై వ్యాఖ్యలు అనుచితం

సలాం ప్రొద్దుటూరు:

జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జబీవుల్లా మంగళవారం స్థానిక ఆయన కార్యాలయంలోజరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర హోమ్ మంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు అనుచితం గా ఉన్నాయని ఆయన అన్నారు. దళిత మహిళ అయిన మంత్రిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదని స్పష్టం చేసిన ఆయన, ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతిని దిగజార్చుతున్నాయని విమర్శించారు. అమర్‌నాథ్ రెడ్డి తన వ్యాఖ్యలను నియంత్రించు కోవాలని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. అభివృద్ధి అంశాలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత దూషణలు చేయడం తగదని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే, అధికారులు పనులను పారదర్శకంగా నిర్వహించారని తెలిపారు. భూసేకరణలో 482 ఎకరాల కొనుగోలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే మొత్తం 23 వేల ఇళ్లకు గాను 19,924 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించగా, 3,144 ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మాట్లాడుతూ 19,924 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో కొనసాగుతు న్నాయని చెప్పారు. నిధుల వినియోగం సక్రమంగా జరిగిందని, ఇంకా సుమారు 3 వేల ఇళ్లు పూర్తి కావాల్సి ఉందని వెల్లడించారు.