శ్రీ కాశీ హనుమత్ లింగేశ్వరస్వామి (మూలస్వామి) దేవాలయంలో అన్న ప్రసాద వితరణ
సలాం ప్రొద్దుటూరు: స్థానిక రామేశ్వరం ప్రాంతంలోని శ్రీ కాశీ హనుమత్ లింగేశ్వరస్వామి (మూలస్వామి) దేవాలయంలో సోమవారం “శివోహం అన్నప్రసాద సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం” భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన జూటూరు మదుసూధన రావు, లక్ష్మీ కుమారి దంపతులు తమ కుమారులు సాయి కౌశిక్, రిషి ఆర్యల సహకారంతో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య దాతలుగా నిలిచారు. భక్తులకు స్వచ్ఛమైన, శుచిగా తయారుచేసిన అన్నప్రసాదాన్ని వందలాది మంది భక్తులకు పంపిణీ చేశారు. ఆలయానికి...