SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 1:12 am Posted by : SALAM PRODDATUR

మహాకవి శ్రీ శ్రీ కి ఘన నివాళులు..

సలాం ప్రొద్దుటూరు:

 

తెలుగు సాహిత్యానికి కొత్త దిశను చూపిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ, శ్రీశ్రీ రచనలు సామాన్య ప్రజల జీవన విధానం, శ్రామికుల కష్టాలు, సామాజిక అసమానతలు, విప్లవాత్మక ఆలోచనలను ప్రతిబింబిస్తూ తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని సృష్టించాయని పేర్కొన్నారు. ఆయన రచించిన “మహాప్రస్థానం” తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిందని అన్నారు.

జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రజల కోసం కలం పట్టిన మహాకవి శ్రీశ్రీ యువతలో చైతన్యాన్ని నింపి సమాజంలో మార్పుకు దోహదపడ్డారని తెలిపారు. “కాదేదీ కవిత కనర్హం” అనే ఆయన భావజాలం తెలుగు కవిత్వానికి కొత్త నిర్వచనాన్ని అందించిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర కోశాధికారి బోగా గంగాధర్, సుధాకర్, వారాధి మధు,kp sir, సుబ్బారావు , విఠలాచార్య తదితరులు పాల్గొన్నారు.