SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 2:04 am Posted by : SALAM PRODDATUR

మంగళవారం టీడీపీ విజయోత్సవ ర్యాలీ–ఎం ఎల్ ఎ వరద

సలాం ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పాలన పూర్తైన సందర్భంగా ప్రొద్దుటూరులో మంగళవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు .ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమవుతుందని, అక్కడి నుంచి ర్యాలీగా శివాలయం సెంటర్ వరకు వెళ్లి, అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే , టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.