SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 1:20 am Posted by : SALAM PRODDATUR

నిబంధనలు పాటించని ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలి–DYFI డిమాండ్

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మేరీ కుమార్,విశ్వనాధ్ లు తెలిపారు.సోమవారం ప్రొద్దుటూరు ఎంఈవో శోభారాణి కి వినతిపత్రం ఇచ్చారు.    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణం లోని ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థలు పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు ఇస్టానురీటిలో విచ్చలవిడిగా అధికారెట్లకు అమ్ముతున్నారు అన్నారు.పుస్తకాలలో ఒక రేటు బయట తల్లిదండ్రులకు బిల్లు ఇచ్చేవాటిలో ఇంకరేటు వేసి అమ్ముతున్నారు అన్నారు.అలాగే ఫీజులు వేల రూపాయలు నర్సరీ నుండి వసూలు చేస్తున్నారని అన్నారు.పాఠశాలలు నోటీసు బోర్డులో ఫీజుల పట్టిక,స్టాఫ్ విద్యార్హతలు ఎక్కడా లేవు అన్నారు.వీటిపై ఎంఈవో సావిత్రమ్మకు ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేసి సమస్య కూడా వినడం లేదని ప్రైవేటు,కార్పొరేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నదని అన్నారు.నిబంధనలు పాటించని పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.