సలాం ప్రొద్దుటూరు:
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా రైజ్ (రిసెర్చ్ అండ్ ఇన్సైట్స్ స్ట్రాటజిక్ ఎవల్యూషన్) సంస్థ నిర్వహించిన సర్వేలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టాప్-10లో నిలిచారు. ప్రజలకు అందుబాటు, అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంలో చురుకుదనం వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ఆంధ్రకేసరి రోడ్‌లో డాక్టర్ మచ్చా నాగభూషణం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నందమూరి యువసేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.