SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 1:05 pm Posted by : SALAM PRODDATUR

విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిచేసిన ఎమ్మెల్యే

సలాం ప్రొద్దుటూరు:

విశ్వ బ్రాహ్మణుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఆదివారం ప్రొద్దుటూరు విరాట్ నగర్ (ఆచార్య కాలనీ) శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు విశ్వబ్రాహ్మణ విద్యార్థిని,విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను  ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అందజేసారు.

అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనపరచి 600 మార్కులకు 500 పైన మార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ ఆణిముత్యాలైన విద్యార్థిని,విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు మేమెంటో లు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు,రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి గారు,రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు గారు,రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ పేట చంద్రశేఖర్ గారు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ గారు,BC నాయకులు బొర్రా రామాంజనేయులు గారు,నాగరాజు ఆచారి,మహిళా నాయకురాలు లక్ష్మి,అలివేలు,కుమారి,వెంకటరమణ ఆచారి,శ్రీనివాస మూర్తి ఆచారి,భాస్కర్ రావు,బాలయ్య ఆచారి,శ్రీధర్ ఆచారి,వడ్ల నరేష్,కిశోర్ ఆచారి,బాల బ్రహ్మ ఆచారి,వీరబ్రహ్మేంద్ర ఆచారి,రామకిషోర్,రామ్ ప్రసాద్,రంగా ఆచారి,శ్రీనివాసుల ఆచారి,సూర్యనారాయణ ఆచారి,పురుషోత్తం ఆచారి,నాగరాజు ఆచారి తదితరులు పాల్గొన్నారు.*