రైతుల సంక్షేమానికి పీఎం-కిసాన్ పథకం
సలాం ప్రొద్దుటూరు: దేశ రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం విజయవంతంగా కొనసాగుతోందని బీజేపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు వంకదార నరేంద్రరావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభంలో చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని అనంతరం...