జాతీయ సదస్సు – పరిశోధనా పత్రాల ఆహ్వానం
సలాం ప్రొద్దుటూరు: “పర్యావరణం – తెలుగు సాహిత్యం” భూమిపుత్ర పత్రిక ఆధ్వర్యంలో జరుగుతుంది.తెలుగు సాహిత్యం ప్రకృతిని కేవలం సౌందర్యానుభూతికి పరిమితం చేయలేదు. జీవన విధానం, సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయం, మానవ–ప్రకృతి సహజీవనం, పర్యావరణ సమతుల్యత, సామాజిక చైతన్యం వంటి అనేక కోణాల్లో ప్రకృతిని ఆవిష్కరించింది. నన్నయ కాలం నుంచి ఆధునిక డిజిటల్ రచనల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రతి ప్రక్రియలో ప్రకృతి ఒక సజీవ శక్తిగా, మానవ నాగరికతకు మార్గదర్శకంగా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, జీవవైవిధ్య క్షీణత, నీటి సంక్షోభం, అటవీ వినాశనం,...