అగస్త్యేశ్వరాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవం – 40 ఏళ్ల తర్వాత ఘనంగా నిర్వహణ

సలాం ప్రొద్దుటూరు:   ప్రొద్దుటూరు నడిబొడ్డున వెలసిన అగస్త్యేశ్వరాలయంలో నేటి నుంచి మహా కుంభాభిషేక మహోత్సవం ఆలయ ఈఓ కె.వి. రమణ, పాలకమండలి చైర్మన్ వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమవు తున్నట్లు అర్చకులు తెలిపారు. ఆదివారం స్థానిక ఆలయంలో అర్చకులు సతీష్ శర్మ, ఉదయ భాస్కర్, పాలకమండలి సభ్యులు దేవర శెట్టి నాగ విక్రాంత్ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించి ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. నేటి కార్యక్రమాలు వేద మంత్రోచ్చా రణలు, మంగళ వాయిద్యాలతో ప్రారంభమవుతాయని తెలిపారు. దైవానుజ్ఞ, బ్రాహ్మణానుజ్ఞ, యాగశాల అలంకరణ,...