రక్తదాతలను ప్రోత్సహిద్దాం
సలాం ప్రొద్దుటూరు: ప్రతి ఒక్కరూ రక్తదాతలను ప్రోత్సహించాలని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనందబాబు తెలిపారు.ఆపద సమయంలో ఉన్న వ్యక్తికి రక్తదానం చేయడం అనేది ప్రాణ దానం చేయడంతో సమానమన్నారు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఆస్పత్రిలో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపోహలను వీడి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేస్తే ఆరోగ్యం క్షీణిస్తుందని, నీరసం కలుగుతుందనే భావన చాలామందిలో ఉందన్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు...