బేతానియా చర్చి వ్యవహారంలో ఉద్రిక్తతలు నివారించేందుకు పోలీసుల చర్యలు
సలాం ప్రొద్దుటూరు: స్థానిక లోని విజయనగరం వీధిలో ఉన్న బేతానియా చర్చిలో పాస్టర్ నియామకానికి సంబంధించిన వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సంఘ సభ్యులలోని రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న అభిప్రాయ భేదాలు శాంతిభద్రతల సమస్యలకు దారితీయకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఈ క్రమంలో వివాదానికి సంబంధం ఉన్న 14 మంది వ్యక్తులను తహశీల్దార్ సమక్షంలో బౌండ్ ఓవర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై స్పందించిన ప్రొద్దుటూరు...