తాలీమ్-ఏ-హునార్ పరీక్షలో ప్రొద్దుటూరు విద్యార్థుల ప్రతిభ
సలాం ప్రొద్దుటూరు: తాలీమ్-ఏ-హునార్ పథకం కింద నిర్వహించిన ప్రతిభా పరీక్షలో ప్రొద్దుటూరుకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా స్థానిక నెహ్రూ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపికైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, జిల్లా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్తియార్, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, ప్రతిభ ఆధారంగా 250 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల...