పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన రిమాండ్ ఖైదీఎట్టకేలకు రెండు నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు

సలాం ప్రొద్దుటూరు (గుంటూరు): మార్చి 28న గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుంచి పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన రిమాండ్ ఖైదీ భీముడు అజిత్ కుమార్ ఎట్టకేలకు రెండు నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. సైబర్ నేరాలకు పాల్పడడంలో దిట్టగా పేరుగాంచిన అజిత్ కుమార్‌ను పలు మోసాల కేసుల్లో పోలీసులు గతంలో పలుమార్లు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అజిత్ కుమార్ ప్రధానంగా ఓఎల్ఎక్స్ వేదికగా మోసాలకు పాల్పడేవాడు. గతంలో ఒంగోలు పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న...