SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 12:05 am Posted by : SALAM PRODDATUR

కోడికూర కోసం గొడవ.. కొడుకు చేతిలో తండ్రి హతం

 

సలాం ప్రొద్దుటూరు (జనగామ):

కోడికూర విషయంలో జరిగిన గొడవలో తండ్రి హతమయ్యాడు. SI శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ (D) తరిగొప్పుల (M) అక్కరాజుపల్లికి చెందిన రమేశ్ (42) మంగళవారం రాత్రి నాటుకోడి కూర వండే విషయంలో భార్యతో గొడవపడ్డాడు. అడ్డువచ్చిన కొడుకును కొట్టాడు. దీంతో ఆవేశానికి లోనైన కొడుకు రోకలిబండతో తండ్రిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. జనగామ నుంచి మెరుగైన చికిత్సకోసం HYD తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు