SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 10:50 pm Posted by : SALAM PRODDATUR

హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి –జిల్లా ఎస్పీ

సలాం ప్రొద్దుటూరు (కడప):

ద్విచక్రవాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలని అలాగే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనీ ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 166 కేసులు నమోదు, రూ.36,045 జరిమానా విధించడం జరిగిందని జిల్లా ఎస్.పి తెలిపారు. కార్లలో వెళ్లే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని , రాంగ్ రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.