SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 3:45 pm Posted by : SALAM PRODDATUR

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు – వైఎస్ జగన్

సలాం ప్రొద్దుటూరు:

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తారని మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్ సీపీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకటించారు.దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి.చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం.
దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం.