SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 4:12 pm Posted by : SALAM PRODDATUR

తిరుపతి లో దివ్యాంగుల ఓటు హక్కు పరిరక్షణ, SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)

సలాం ప్రొద్దుటూరు (తిరుపతి):

దివ్యాంగుల ఓటు హక్కు పరిరక్షణ, SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విధానంపై అవగాహన సమావేశం స్థానిక సిపీఎం ఆఫీసులో జరిగింది. సుమారు 50మంది వివిధ ప్రాంతాల నుండి దివ్యాంగ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కె ఎం ఎం సుభాన్ మాట్లాడుతూ..సవ్యాంగులు సైతం ఎదుర్కోలేని SIR ను దివ్యాంగులు ఎదుర్కోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు?. ఈనెల 13 14 తేదీల్లో బిఎల్వోలు తమ తమ బూతుల్లో ఉంటారు. వారిని కలిసి తమ పేర్లు ఓట్లు మ్యాపింగ్ చేసుకోవాలని, దివ్యాంగుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రత్యేక బిఎల్వోల బృందం దివ్యాంగుల సేవ కోసం వారి ఓట్ల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం లీగ్ నెల్లూరు జిల్లా నాయకులు హసన్ బేగ్ మాట్లాడుతూ.. ఓట్ల మ్యాపింగ్, పౌరసత్వ నిరూపణలో ఎదురయ్యే చిక్కు సమస్యలను పరిష్కరించేందుకు పారినర్స్ ట్రిబ్యునల్ లో కేసులు వాదించేందుకు ప్రజాస్వామ్యవాదులైన అడ్వకేట్లు ముందుకు రావాలని వారితో ప్రత్యేకించి దివ్యాంగులు సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపు నిచ్చారు.సభలో ధివ్యాంగ నాయకురాలు మధులత, డాక్టర్ జాలేశ్వర్, ఉమాశంకర్, ముహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.