SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 4:01 pm Posted by : SALAM PRODDATUR

జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసిన నాయకుడు పుత్తా నరసింహా రెడ్డి –

సలాం ప్రొద్దుటూరు (కమలాపురం):

కడప జిల్లాలో టిడిపి పార్టీని బలోపేతం చేసిన నాయకుడు పుత్తా నరసింహారెడ్డిని మైనార్టీ నాయకుడు ఖాదర్ బాషా కొనియాడారు. గురువారం ఆయన కమలాపురంలోని  ఆయన కార్యాలయంలో  సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.17 సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి ఎన్నో సేవలు చేసి జిల్లాలో ఎందరో నాయకులకు వెన్నంటే ఉండి , నియోజకవర్గంలో కార్యకర్తలకు ,నాయకులకు అండగా నిలిచి పూర్వవైభవం తెచ్చిన నాయకుడు పుత్త నరసింహారెడీ అని కొనియాడారు . అధిష్టానం చెప్పిన పనులను క్రమశిక్షణతో ఎలాంటి లోపాలు లేకుండా కార్యక్రమాలను విజయవంతం చేశాడని అన్నారు. 2009 నుండి నేటి వరకు అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు . జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే ముందుగా గుర్తుకు తెచ్చుకునే పేరు పుత్తా నరసింహా రెడ్డి అని అన్నారు.ఎన్నికల సమయంలో పుత్తా కు ఇస్తామని  అధిష్టానం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు ఉండే పదవిని  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  , విద్యాశాఖ మంత్రి  నారా లోకేష్ ఇవ్వాలని ప్రజలు ,నాయకులు , కార్యకర్తలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.