ఎం పి జె ఆధ్వర్యంలో విద్యా జాగృతి ఉద్యమం
సలాం ప్రొద్దుటూరు: మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) ఆధ్వర్యంలో “బడికి పోదాం – భవిష్యత్తును నిర్మించుకుందాం!” అనే నినాదంతో విద్యా జాగృతి ఉద్యమాన్ని ప్రొద్దుటూరు మండలంలోని సోములవారి పంచాయతీ పరిధిలోని పెన్నా నగర్ మరియు ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రాంతాలలో గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏంపీజే కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని విద్య యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లని పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహించారు. ప్రతి చిన్నారి...